దశలవారీ మద్యపాన నిషేధం హామీపై హర్షం

కృష్ణా జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీపై మహిళలు, కల్లుగీత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.  వైయస్‌ జగన్‌ను కలిసి కల్లు గీత కార్మికులు తమ కష్టాలను చెప్పుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కైకలూరు నియోజకవర్గంలో కల్లు గీత కార్మికులు కలిశారు. నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం తమకు చేసింది శూన్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రుణాలు అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి వైయస్‌ జగన్‌హామీ ఇచ్చారని వారు సంతోషం వ్యక్తం చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top