టీడీపీ అవినీతి పాలనపై దర్యాప్తుకు డిమాండ్

శ్రీకాకుళం(సీతంపేట): టీడీపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని పాలకొండ ఎమ్మెల్యే కళావతి మండిపడ్డారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేలను లాక్కోవడంపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని దుయ్యబట్టారు. కరవు మండలాలు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు  పరిహారం అందించిన పాపాన లేదన్నారు. కరవు మండలాల్లో 15వేల బోర్లు తీస్తామన్నారు. ఒక్క బోరు తవ్విన దాఖలాలు లేవని ఫైరయ్యారు.

నీతివంతమైన పాలన అందిస్తామంటూనే అవినీతి పాలన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎస్సీ, ఎస్టీ నిధుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడన్నారు. ఉపకార వేతనాల్లోనూ భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని కళావతి చెప్పారు. అక్రమార్కులకు అధికార నేతలు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. సీబీసీఐడీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top