కాకర్లపూడి శ్రీనురాజు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. కాకర్లపూడి శ్రీనురాజు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. అలమండ మేజర్‌ పంచాయతీ మాజీ సర్పంచ్‌ కాకర్లపూడి శ్రీనురాజుకు వైయస్‌ జగన్‌ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్న నాయకులు, కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నార‌ని చెప్పారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు ఒక్క వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డేనని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి వైయ‌స్ఆర్‌సీపీని  అధికారంలోకి తీసుకువస్తామని ప్రతిన బూనారు. 
Back to Top