కాకినాడలో జోరుగా వైయస్‌ఆర్‌ సీపీ ప్రచారం

కాకినాడ: కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు చేస్తున్న వైపల్యాలను వైయస్‌ఆర్‌ సీపీ ఎండగడుతుంది. ప్లీనరీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల గురించి పార్టీ అభ్యర్థులు, నాయకులు ప్రజలకు వివరిస్తూ, ప్రజలను చైతన్యపరుస్తున్నారు. 2014 ఎన్నికల్లో వందల కొద్ది హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుంటూ రైతులను, డ్వాక్రా మహిళలను, యువతను నట్టేట ముంచాడని కాకినాడ ప్రజానికమే చెబుతుంది. మోసకారి చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. 
ఇదిలా ఉండగా 26న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడలో పర్యటించనున్నారు. వైయస్‌ జగన్‌ పర్యటనతో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం రానుంది. 
Back to Top