కాకినాడలో టీడీపీకి ఓటమి తప్పదు

కాకినాడ: చంద్రబాబు మతిమరుపు వ్యాధితో ఇచ్చిన హామీని గంటకే మర్చిపోతున్నాడని స్వయాన తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. కాకినాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు తన కొడుక్కి మంత్రి పదవి ఇచ్చుకోవడం తప్ప నిరుద్యోగులకు ఇక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బాబు పాలనలో హెరిటేజ్‌ కంపెనీ తప్ప ఏ ఇతర కంపెనీలు అభివృద్ధి చెందలేదన్నారు. కాకినాడలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయన్నారు. మూడేళ్ల కాలంలో ఏం చేశావని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కాకినాడ ఎమ్మెల్యే విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలే చెబుతున్నారన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తప్పదన్నారు. 
 
Back to Top