జ‌గ‌న‌న‌న్న మాట‌లు న‌మ్ముతున్నాం

తూర్పు గోదావరి: కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇవ్వడం పట్ల కాపులంతా హర్షిస్తున్నారని కాకినాడ కార్పొరేటర్‌ పేర్కొన్నారు. జ‌గ‌న‌న్న మాట‌లు న‌మ్ముతున్నామ‌ని మ‌హిళ‌లు పేర‌ర్కొన్నారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్‌కు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని చెప్పి రూ.1300 కోట్లు మాత్రమే ఇచ్చారని మహిళలు మండిపడ్డారు. చంద్రబాబుకు ఈ నాలుగేళ్లలో కాపులకు మంచి చేయాలని తెలియలేదా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి పనిచేసిన చంద్రబాబుకు కాపు రిజర్వేషన్లపై ఎందుకు నరేంద్ర మోడీని కోరలేదని మండిపడ్డారు. మంజునాథ్‌ కమిషన్‌ సభ్యులందరూ సంతకం చేయకుండానే అసెంబ్లీలో హడావుడిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బాటలో వైయస్‌ జగన్‌ కూడా నడుస్తున్నారని, ఇచ్చిన మాట తప్పరని ఆమె పేర్కొన్నారు.
 
Back to Top