పెంచాల్సిందిపోయి.. పెన్షన్లలో కోత పెడతారా

జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి
అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లను ఎగ్గొడుతున్నారు
తెలుగుదేశం కార్యకర్తల పేర పెన్షన్లు రాసుకుంటున్నారు
అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్ దిఃకాకాని

అసెంబ్లీః రాష్ట్రంలో పెన్షన్లు ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ...ప్రభుత్వం జన్మభూమి కమిటీలను టీడీపీ నేతలతో నింపేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రింగర్ ప్రింట్లు పడట్లేదని, ఆధార్ కార్డు జాబితా నుంచి పెన్షన్ లను తొలగిస్తున్నారని ఫైరయ్యారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అర్హులైన వారందరికీ పెన్షన్ ఇస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కాకాని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్ ఇవ్వకుండా తెలుగుదేశం కార్యకర్తలు తమ పేర పెన్షన్ రాసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై  తాము కోర్టు కెళితే పరిశీలన కోరిందన్నారు. అప్పుడు ఇచ్చిన పెన్షన్లు ఆపేసి దాన్ని సరిదిద్దే పరిస్థితికి తీసుకొచ్చారా లేదా ..? ఇది వాస్తవమా కాదా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 

మీరు ఏనాడైనా గ్రామాలకు నిష్పత్తి ప్రకారం పెన్షన్లు ఇచ్చారా అని కాకాని ప్రభుత్వాన్ని కడిగి పారేశారు.  అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని స్పష్టం చేశారు.  గతంలో ఉన్న 43 లక్షల పెన్షన్లను 39 లక్షలకు తగ్గించిన ఘనత టీడీపీదని ఎద్దేవా చేశారు. పెన్షన్ల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం తగ్గించడం దుర్మార్గమన్నారు. టీడీపీ తన చర్యకు సిగ్గుపడాలని కాకాని విరుచుకుపడ్డారు. 

జన్మభూమి కమిటీలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయంటే....మాగాణి లేని వాళ్లకు ఉంది అని రాస్తూ పెన్షన్ ఎగ్గొడుతున్నారు . భర్త లేకున్నా వితంతువులకు భర్త ఉన్నాడని రాస్తున్నారని, ఏ నేల లేని కూలీల పేర పైరు ఉందని రాస్తున్నారని కాకాని మండిపడ్డారు. అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు ఇవ్వకుండా ప్రభుత్వం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని కాకాని గోవర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. 
Back to Top