బాబు చీకటి పాలనకు చరమగీతం పాడుదాం

–సొంత నియోజకవర్గంలో పోటీచేసే ధైర్యం బాబుకు లేదు...
–బాబువస్తే జాబు పేరుతో లోకేష్‌కు రెండు ఉద్యోగాలు...
–వైయస్‌ఆర్‌సీపి నవర త్నాలతో రాష్ట్రానికి మహార్థశ..
–వైయస్‌ఆర్‌సీపి జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి

వెంకటాచలం: రాష్ట్రంలో బాబు చీకటిపాలనకు చరమగీతం పాడేందుకు నాయకులు,కార్యకర్తలు సిద్దం కావాలని వైయస్‌ఆర్‌సీపి జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వెంకటాచలం మండలం చెముడుగుంట స్రిడ్స్‌ కల్యాణమండపంలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి అధ్యక్షతన సర్వేపల్లి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపి నవరత్నాల సభను గురువారం ఉదయం నిర్వహించారు. ఈసభలో దివంగత సీఎం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించి సభను ప్రారంభించారు. ఈసందర్భంగా వైయస్‌ఆర్‌సీపి జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.... బాబు పాలనపై రాష్ట్ర ప్రజలు తీవ్రవ్యతిరేకత చూపుతున్నారని తెలియజేశారు. అధికారం చేతిలో ఉందని ప్రతిపక్షాలపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడడం, అక్రమ కేసులు మోపడం, వైయస్‌ఆర్‌సీపి నాయకులు, కార్యకర్తలను వేధించే విషయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పోటీ చేసే ధైర్యంలేక కుప్పంలో పోటీచేసే చంద్రబాబుకు ...సొంత నియోజకవర్గంలో పోటీచేస్తూ ఓటమి ఎరుగని చరిత్ర గలిగిన దివంగత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు వైయస్‌ఆర్‌సీపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి పోలిక ఎక్కడదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రెండేళ్లు చూపి మూడు పంగనామాలు చూపిన హీన చరిత్ర బాబుదైతే , ఇచ్చిన వాగ్దానాలన్నింటీని అమలు చేసిన ఘనత ఓక్క వైయస్‌ఆర్‌దేనన్నారు.  రాష్ట్ర ప్రజలందరినీ పక్కనబెట్టి బాబు తన కుమారుడు లోకేష్‌బాబుకు రెండు ఉద్యోగాలు ( ఎమ్మెల్సీ, మంత్రి పదవి) ఇప్పించుకున్నారని విమర్శించారు. బాబు పాలనలో ఆయన కుటుంబసభ్యులు, అనుచరులుకు తప్ప రాష్ట్ర ప్రజానికానికి ఓరిగిందేమీలేదని తెలియజేశారు. మోసం చేయడంలో బాబును మించిన చరిత్ర ఏ రాజకీయనాయకుడుకి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇంటికొక కారు, మహిళలకు కేజీ బంగారం ఇస్తామని ఆశ చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.

అభివృద్దిని అడ్డుకుంటున్నాననే దుష్ప్రచారం తగదు:
సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృధ్దిని అడ్డుకుంటున్నాననే దుష్ప్రచారాన్ని మంత్రి సోమిరెడ్డి చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పేదల గురించి పట్టించుకునే ఆలోచనే ఉంటే జిల్లాలో నాలుగు సార్లు ఎందుకు ఓటమిచెందాడని మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి ఇవ్వకుండా ధనవంతులకు ఇవ్వడాన్ని అడ్డుకోవడం అభివృద్దిని అడ్డుకోవడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఏ ఓక్క కార్యకర్తను ఇబ్బందిపెట్టినా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కార్యకర్తల కోసం ఎంత దూరం ముందుకెళ్లేందుకైనా సిద్దమేనన్నారు. సంక్షేమ పథకాలు అమలులో ఎస్సీ, ఎస్టీలకు తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని జీవోలు ఉంటే వాటిని పట్టించుకోకుండా లబ్దిదారులు ఎంపిక చేయడం, సర్పంచులకు తెలియకుండా సభలు నిర్వహించే అధికారం టిడిపి నాయకులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ది పనులు చేసేందుకు జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలతో వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. నవరత్నాల కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top