సోమిరెడ్డి వంక‌ర బుద్ధి మార్చుకో

నెల్లూరుః సాగునీరు అందించాల‌ని విన‌తిప‌త్రం ఇవ్వ‌డానికి వెళితే.. తెలుగుదేశం పార్టీ కండువాలు క‌ప్పి వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు టీడీపీలో చేరారంటూ మంత్రి సోమిరెడ్డి ప్ర‌క‌టించుకుంటున్నార‌ని పొద‌ల‌కూరు మండలం బ‌త్తుల‌ప‌ల్లి గ్రామ‌స్తులు తీవ్రంగా మండిప‌డ్డారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైయ‌స్ఆర్ సీపీ వీడిపోమ‌ని, మంత్రి సోమిరెడ్డికి మ‌తిభ్ర‌మించి ఇలాంటి చేష్ట‌లు చేస్తున్నార‌న్నారు. సోమిరెడ్డి చ‌ర్య త‌మ‌ను బాధించింద‌ని బ‌త్తుల‌ప‌ల్లి గ్రామ‌స్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్ సీపీతోనే న‌డుస్తామ‌ని చెప్పిన గ్రామ‌స్తుల‌కు ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి ధ‌న్య‌వాదాలు చెప్పారు. విన‌తిప‌త్రం ఇవ్వ‌డానికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు కండువాలు క‌ప్పి టీడీపీలో చేరార‌ని ప్ర‌క‌టించుకోవ‌డం సిగ్గుచేట‌న్నారు. ఇప్ప‌టికైనా సోమిరెడ్డి త‌న వంక‌ర‌బుద్ధిని మార్చుకోవాల‌ని సూచించారు.


Back to Top