పంటలు ఎండిన ప్రాంతాల్లో పర్యటన..!

నెల్లూరు :
రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తూ వైఎస్సార్సీపీ
నేతలు రైతులకు అండగా నిలుస్తున్నారు. కళ్లముందే ఎండిన పంటలతో రైతులు
విలవిలలాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నేతలు మండిపడుతున్నారు.
జిల్లాలోని పొదలకూరులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి
ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు ఎమ్మెల్యే వద్ద తమ
గోడు వెళ్లబోసుకున్నారు . పంటలన్నీ ఎండిపోయి నష్టల్లో కూరుకుపోయిన రైతులను
ఓదార్చారు.

జిల్లాలోని రైతుల పరిస్థితి దయనీయంగా
ఉందిన కాకాని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ నీళ్లు తెస్తా, శ్రీశైలం
నీళ్లు నెల్లూరు జిల్లాకు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మాటలు
నీటిమూటలయ్యాయని కాకాని అన్నారు.  తక్షణమే నెల్లూరు జిల్లాను కరవు జిల్లాగా
ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.   
Back to Top