ప్రజాక్షేత్రంలో ఓట్లు సాధించే పద్ధతి ఇదేనా?

 

-  తాగునీటితోనూ రాజకీయ లబ్ధి
- బోరు వేయిస్తే పూడ్చమని ఒత్తిడి
 నెల్లూరు: తాగునీరు అందకుంటే అధికార టీడీపీ ఏర్పాటు చేసిన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి రాజకీయంగా లబ్ధిపొందే నీచస్థాయికి మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దిగజారార‌ని, ప్ర‌జా క్షేత్రంలో ఓట్లు సాధించే ప‌ద్ధ‌తి ఇదేనా అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి  గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు.  ప్రజలకు దూరం అవుతున్న సోమిరెడ్డి ఎలాగైనా ఓట్లు సంపాదించుకోవాలని తాగునీటితోనూ రాజకీయ లబ్ధిపొందేందుకు చూస్తున్నారని విమ‌ర్శించారు. పొదలకూరు పట్టణ తాగునీటి అవసరాలకు చెరువుకు సమీపంలో వేసిన బోరును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెరువుకు సమీపంలో వేసిన బోరులో అదృష్టం కొద్ది పుష్కలంగా నీరుపడ్డాయని, అయితే మంత్రి ఎండోమెంట్‌ అధికారులకు ఫోన్‌చేసి వెంటనే బోరును పూడ్చివేయించాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపించారు. మరో 20 రోజుల్లో సర్పంచ్‌ నిర్మలమ్మ పదవీకాలం పూర్తి అవుతుందని, అయితే ఆమె తన పదవీకాలం చివరిరోజుల్లో సైతం తాగునీటిని అందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అధికారపార్టీ నాయకులు మాత్రం అటు కండలేరు సీపీడబ్ల్యూ స్కీమ్‌ నుంచి ఇటు కొత్తగా వేసిన బోర్ల నుంచి నీరు అందకుండా చేసి తామేదో ప్రజల కోసం ట్యాంకర్లను తిప్పుతున్నట్టు భ్రమింపజేయాలని చూస్తున్నారని వెల్లడించారు.   

తాజా వీడియోలు

Back to Top