ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే: కాకాణి గోవర్దన్‌రెడ్డి

నెల్లూరు: స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల పేరుతో పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తున్న ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని నెల్లూరు జిల్లా  సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. వెంకటాచలంలో  స్మార్ట్ విలేజ్‌పై నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం అధికారులతో పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానితో పోరాటం చేయడం, సూచనలు, సలహాలు ఇవ్వడం తమ బాధ్యత అన్నారు.  ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, శుద్ధి నీరు అంటూ అమలుకు యోగ్యం కాని హామీలు  గుప్పిస్తూ ప్రచార ఆర్భాటాలతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు.
Back to Top