ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఉన్న ధ్యాస హోదాపై లేదు

నెల్లూరుః ప్రత్యేకహైదాపై పూటకో మాట చెబుతూ దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యత్నిస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబులు ...రెండేళ్ల తర్వాత హోదా లేదని చెప్పడం ఏపీ ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేలను కొనడంపై ఉన్న శ్రద్ధ...ప్రత్యేకహోదాపై లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడు వైయస్ జగన్ అని కాకాని అన్నారు. నైతిక విలువలను వదిలేసి పచ్చకండువాలు కప్పుకోవడం సిగ్గుచేటని ఫిరాయింపుదారులపై మండిపడ్డారు.

Back to Top