కడప వైయస్‌ఆర్‌సిపి నేతల నిరవధిక నిరశన

కడప, 20 ఫిబ్రవరి 2013: కడప డిసిసిబి ఎన్నికను తక్షణమే నిర్వహించాలంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, మద్దతుదారులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. 'వైయస్‌ఆర్‌ అమర్‌ రహే, జగన్మోహన్‌రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వీరశివారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ దౌర్జన్యాలు నశించాలి, ఎన్నికలు వెంటనే జరిపించాలి' అంటూ పార్టీ కార్యకర్తలు పెద్ద పెట్టున చేస్తున్న నినాదాలతో కడప పట్టణం దద్దరిల్లిపోయింది.‌ మెజారిటీ స్థానాల్లో వైయస్ఆర్‌సిపి గెలిచినా డిసిసిబి అధ్యక్ష పదవిని తమ పార్టీకి దక్కకుండా చేయాలన్న కుట్రతోనే కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల అధికారిని కిడ్నాప్‌ చేయించి డ్రామాలాడుతోందని ఆందోళనకారులు నిప్పులు చెరిగారు.

అంతకు ముందు, డిసిసిబి ఎన్నికలు నిర్వహించాల్సిన‌ డిసిఒ అధికారి చంద్రశేఖర్ మంగళవారం రాత్రి నుంచి అయ్యారు. దీనితో కడప డిసిసిబి ఎన్నిక నిలిచిపోయింది. డిసిసిబి ఎన్నిక కోసం ఉదయాన్నే కాంగ్రెస్ , వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ మద్దతుదారులు కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారి రాకపోవటంతో వై‌యస్‌ఆర్‌సిపి మద్దతుదారులు ఆ వెంటనే కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ‌వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు, నాయకులు డిసిసిబి ఎదుట ధర్నాకు దిగారు. నివవధిక నిరాహార దీక్షలో‌ మాజీ మంత్రి, మహానేత వైయస్‌ఆర్‌ సోదరుడు వైయస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసులు, పార్టీ జిల్లా ‌కన్వీనర్ సురే‌ష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, గత రాత్రి నుంచి కనిపించకుండా అదృశ్యమైన డిసిఒ అధికారి చంద్రశేఖర్‌ చిత్తూరు జిల్లా మొలకలచెరువులో ఉన్నట్లు సమాచారం.

తాజా వీడియోలు

Back to Top