ద‌ద్ద‌రిల్లిన‌ క‌డ‌ప క‌లెక్ట‌రేట్

 

- వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో క‌రువు సాయంపై పోరాటం
- క‌డ‌ప క‌లెక్ట‌రేట్ వ‌ద్ద భారీ ధ‌ర్నా
- అధిక సంఖ్య‌లో హాజ‌రైన రైతులు, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు
వైయ‌స్ఆర్ జిల్లా:    వ్య‌వ‌సాయ రంగంపై రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రైతులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. త‌క్ష‌ణ‌మే క‌రువు సాయం అంద‌జేయాల‌ని డిమాండు చేస్తూ సోమ‌వారం వైయ‌స్ఆర్ జిల్లా క‌డ‌ప న‌గ‌రంలోని క‌లెక్ట‌రేట్ వ‌ద్ద రైతులు భారీ ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా తాజా మాజీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయిందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దిక్కుతోచని పరిస్థితిలో రైతు ఉ‍న్నారని తెలిపారు. పడకేసిన ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతాంగం సాగు, తాగునీరు లేక విలవిలలాడిపోయే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి రైతాంగం కోసం 90 శాతం ప్రాజెక్టు పనులు  పూర్తి చేస్తే, మిగిలిన 10% పనులు పూర్తి చేయలేని స్థితిలో సీఎం చంద్రబాబు నాయడు పాలన కొనసాగుతుందని విమ‌ర్శించారు. ఈ ధ‌ర్నాకు జిల్లా న‌లుమూల‌ల నుంచి అధిక సంఖ్య‌లో రైతులు క‌దిలిరావ‌డంతో క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణం కిట‌కిట‌లాడుతోంది. ధ‌ర్నాలో ఎమ్మెల్యేలు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, ర‌ఘురామిరెడ్డి, శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, అంజాద్‌బాషా, శ్రీ‌కాంత్‌రెడ్డి, మేయ‌ర్ సురేష్‌బాబు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.
Back to Top