కాశవారిగూడెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర

కాశవారిగూడెం (నల్గొండ జిల్లా), 14 ఫిబ్రవరి 2013: శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 66వ రోజు గురువారం ఉదయం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని కాశవారిగూడెం నుంచి ప్రారంభమైంది. నల్గొండజిల్లాలో నేడు శ్రీమతి షర్మిల పాదయాత్ర 7వ రోజు కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, దానికి వంత పాడి కొమ్ము కాస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగాను, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

శ్రీమతి షర్మిల గురువారం ఉదయం తన పాదయాత్రను రామడుగు మండలంలోని కాశవారిగూడెం నుంచి ప్రారంభించారు. వేలాది మంది అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంట నడుస్తుండగా శ్రీమతి షర్మిల ఉత్సాహంగా ముందుకు కదిలారు. గురువారం నాడు ఆమె మొత్తం 14.5 కిలోమీటర్లు నడుస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత శ్రీమతి షర్మిల పాదయాత్ర తిమ్మాపురం క్రాస్‌రోడ్డు, అనుమాముల మీదుగా హాలియా చేరుతుంది. హాలియాలో నిర్వహించే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. రాత్రికి హాలియాలోనే బస చేస్తారు.
Back to Top