కార్మికుల కోసం వైయస్ఆ‌ర్‌టియుసి రాజీలేని పోరు

కడప :‌ కార్మికుల హక్కుల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్మిక విభాగం (ట్రే‌డ్ యూనియ‌న్‌) నిరంతరం రాజీ లేని పోరాటం చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్మిక పక్షపాతి అన్నారు. కడపలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన శనివారంనాడు వైయస్‌ఆర్‌టియుజి జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ, వైయస్‌ఆర్‌టియుసిని విస్తృత పరచడంలో కడప జిల్లా రాష్ట్రంలోనే ముందుందన్నారు. భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, బీడీ కార్మికుల నుంచి సభ్యత్వాలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ‌యూనియన్ బలోపేతానికి సహకారం అందిస్తామన్నారు.‌ ఈ సందర్భంగా కడప మాజీ మేయర్ పి.రవీంద్రనా‌థ్‌రెడ్డి, వైయస్‌ఆర్ ట్రే‌డ్ యూనియ‌న్ జిల్లా అధ్యక్షుడు ‌జిఎన్ఎ‌స్ మూర్తి‌, మాట్లాడారు.
Back to Top