'కార్మిక పక్షపాతి వైయస్‌ఆర్‌సిపి ఒక్కటే'

కడప : కార్మికుల పక్షాన వారి సమస్యలపై పోరాటం చేసేది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మాత్రమే‌ అని పార్టీ వైయస్‌ఆర్‌ జిల్లా కన్వీనర్‌ కె. సురేష్‌బాబు పేర్కొన్నారు. జిల్లాలో వైయస్‌ఆర్ ట్రే‌డ్ యూనియ‌న్ రోజురోజు‌కూ బలోపేతం అవుతోందన్నారు. కడపలోని అశోక్‌నగర్ వద్ద బుధవారంనాడు వైయస్‌ఆర్‌ టియుసి ఆటోస్టాండ్‌ను ప్రారంభించి, జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని సురేష్‌బాబు ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని రకాల ప్రయాణ చార్జీలు, నిత్యావసర ధరలు, పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో పేద,‌ బడుగు, బలహీన కార్మికుల జీవితాలు ఛిద్రం అవుతున్నాయన్నారు. తమ ఖజానా నింపుకోవడానికి పాలకులు రాష్ట్రాన్ని దౌర్భాగ్యస్థితిలోకి నెట్టివేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు మేలు జరగాలంటే శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఒక్కటే మార్గమని అన్నారు. వైయస్‌ఆర్ ట్రే‌డ్ యూనియ‌న్ జిల్లా అధ్యక్షుడు జిఎ‌న్ఎ‌స్ మూర్తి ‌కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.

అంతకు ముందు అశోక్‌నగర్ సర్కి‌ల్‌లో ఉన్న మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
Back to Top