వైయస్‌ జగన్‌ మాటపై నమ్మకం ఉంది

తూర్పు గోదావరి:  వైయస్‌ జగన్‌ మాటపై నమ్మకముందని కాపు యువత పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామన్న జగన్‌ ప్రకటపై కాపు యువత హర్షం వ్యక్తం చేసింది. అప్పలనాయుడు అనే యువకుడు మాట్లాడుతూ..కాపులకు మోసం చేసిన చంద్రబాబును నమ్మవద్దని కోరారు.  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి విశేష స్పందన లభిస్తోంది. గోల్లప్రోలు వద్ద పలువురు జననేతను కలిశారుజ పాదయాత్ర దారులన్నీ జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. వైయస్‌ జగన్‌తో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు.
 
Back to Top