వైయ‌స్ జగన్ కు కాపు నేత‌లు మ‌ద్ద‌తు
- కాపు కార్పొరేష‌న్‌కు రూ. 10 వేల కోట్లు ఇస్తామ‌న‌డంపై హ‌ర్షం
- కాపులంతా వైయ‌స్ జ‌గ‌న్ వెంటే ఉంటామ‌ని ప్ర‌క‌ట‌న‌
విశాఖ‌:  కాపు సంక్షేమానికి కృషి చేస్తామన్న వైయ‌స్ జ‌గ‌న్ హామీపై ఆ వ‌ర్గం ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. బుధ‌వారం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ప‌లువురు కాపు నేత‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు. కాపు కార్పొరేష‌న్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామ‌న్న ప్ర‌క‌ట‌న‌ను వారు స్వాగ‌తించారు. పాద‌యాత్ర‌లో ప‌లువురు కాపు యువకులు పెద్ద ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ కు త‌మ మ‌ద్ద‌తు ప‌లికారు. కాపు కార్పొరేష‌న్ కు రూ. 10 వేల కోట్ల నిధుల కేటాయింపుపై హామీ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదులంటూ ప్ల కార్డులు ప్ర‌ద‌ర్శించారు.ఈ సంద‌ర్భంగా కాపు నాయ‌కులు మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు కాపులకు అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.1,340 కోట్లే అన్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి రాగానే రూ.5 వేల కోట్లను రూ.10 వేల కోట్లకు పెంచుతానని చెప్పడం గొప్ప విష‌య‌మ‌న్నారు. బిసిల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌లిగించ‌ని కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కు తాను మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించినందుకు కాపు నేత‌లంతా వైయ‌స్ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని కాపులు ముక్త‌కంఠంతో చెప్పారు.
Back to Top