కాపు రిజర్వేషన్ల కోసం శాయశక్తుల ప్రయత్నం
వైయస్‌ జగన్‌ను కలిసిన కాపు సంఘం నేతలు
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాపు సంఘం నాయకులు కలిశారు. కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలని వైయస్‌ జగన్‌కు వారు వినతిపత్రం అందజేశారు. రిజర్వేషన్ల కోసం శాయశక్తులా ప్రయత్నిస్తానని వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చినట్లు కాపు నేతలు పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తానని వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని విస్మరించారని వారు మండిపడ్డారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబంలో పుట్టిన వైయస్‌ జగన్‌ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తారని కాపు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
Back to Top