కాపు నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌


తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు కోనసీమలో మంచి స్పందన లభిస్తోంది. గ్రామ గ్రామాన జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఆయనతో మాట్లాడేందుకు, కష్టాలు, సమస్యలు చెప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సమస్యలు చెప్పుకుంటూ కొందరు సేదతీరుతుండగా, మరికొందరు సెల్ఫీలు దిగి సంబరపడుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌కు ప‌లువురు ఆక‌ర్శితుల‌వుతున్నారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు అండ‌గా ఉంటాన‌ని రాజ‌న్న బిడ్డ ఇస్తున్న హామీల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు. ఈ క్రమంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌లువురు నేత‌లు ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని న‌గ‌రం వ‌ద్ద కాపు నాయకుడు కొమ్ముల జంగ‌య్య ఆధ్యర్యంలో 30 మంది నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. కాపు వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు మోసం చేశార‌ని ఈ సంద‌ర్భంగా కాపు నేత‌లు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. 
Back to Top