వైయ‌స్ జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం ఉందిఅనంతపురం: త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చూప‌గ‌ల‌ర‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని కాపు, బ‌లిజ సంఘాల నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 38వ రోజు కాపు, బలిజ నేతలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి తమ మద్దతు తెలిపారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని కాపులు మండిపడ్డారు. మా ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు కాపులను విస్మరించారన్నారు.  కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు ఈ నాలుగేళ్లలో కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని, ఆ నిధులను కూడా టీడీపీ నేతలు దోచుకుంటున్నారని కాపు నేతలు తెలిపారు. తమ హామీలను నెరవేర్చాలని వైయస్‌ జగన్‌కు కాపు నేతలు వినతిపత్రం అందజేశామని వారు విలేకరులకు తెలిపారు.  వైయస్‌ జగన్‌ను కలిసిన తరువాత తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం కలిగిందని కాపు, బలిజ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. కాపులను మోసం చేసిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. వైయస్‌ జగన్‌కు తోడుగా ఉంటామని వారు పేర్కొన్నారు.
 
Back to Top