కాంగ్రెస్‌, టిడిపిలకు గట్టిగా బుద్ధి చెప్పండి

మార్టేరు (ప.గో.జిల్లా),

30 మే 2013: జగనన్న నేతృత్వంలో త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, ప్రజలందరి కష్టాలూ జగనన్న తీరుస్తారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. జగనన్న సిఎం అయితే రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుందన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలకు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా శ్రీమతి షర్మిల గురువారం పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె స్థానిక ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆమె మార్టేరులో మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజన్న రాజ్యంలో రైతులు మళ్ళీ రాజుల్లాగా బతుకుతారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. ప్రతి ఊరూ, గ్రామం కళకళలాడతాయన్నారు.

రేషన్‌ సరుకులు ఇవ్వడం మానేశారని కొందరు, పింఛన్లు అందడంలేదని మరి కొందరు శ్రీమతి షర్మిల ముందు రచ్చబండ కార్యక్రమంలో వాపోయారు. ఈ ప్రభుత్వానికి మనసు లేదు, మానవత్వం లేదని శ్రీమతి షర్మిల ఆరోపించారు. పేదలంటే కనికరం లేదని, రైతులంటే శ్రద్ధ లేదు, విద్యార్థులు, ప్రజల గురించి ఆలోచన అంతకన్నా లేదని ఆమె నిప్పులు చెరిగారు. వృద్ధులు, వితంతువులు, విద్యార్థుల పట్ల కిరణ్‌ ప్రభుత్వం నిర్దయగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. కరెంటు చార్జీలను ఇప్పటికే నాలుగుసార్లు పెంచిందని విమర్శించారు. అన్ని రకాల చార్జీలు, ధరలు పెంచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు, పరిశ్రమలకు కరెంటు ఉండడంలేదని, కరెంటు లేక వేలాది పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

జగనన్న నేతృత్వంలో ఏర్పాటయ్యే రాజన్న రాజ్యంలో రైతుల సంక్షేమం కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. విద్యార్థులను చదివించే బాధ్యత జగనన్న తీసుకుంటారని భరోసా ఇచ్చారు. పిల్లలను బడికి పంపించేందుకు అమ్మ ఒడి అనే ఒక అద్భుతమైన పథకం పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు జమచేస్తారని చెప్పారు. జగనన్న సిఎం అయ్యాక రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తారన్నారు. జగనన్న సిఎం అయ్యాక గ్రామాల్లో బెల్టు షాపులను మూయించేస్తాడని భరోసా ఇచ్చారు. నాటు సారా ఎక్కడా దొరకదని అన్నారు. రైతులు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు అందిస్తారన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ. 7 వందలు, వికలాంగులకు వెయ్యి రూపాయలు పింఛన్‌ ఇస్తారన్నారు.

కాగా, మార్టేరు మాజీ సర్పంచ్ కర్రి సుభాషిణి గురువారం ఉదయం శ్రీమతి షర్మిల సమక్షంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు.

ఆలమూరులో మహానేత విగ్రహావిష్కరణ :
రాష్ట్ర ప్రజల బాగు కోసం దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంత గొప్పగా ఆలోచించి మంచి మంచి పథకాలకు రూపకల్పన చేశారో, ఎన్ని మంచి పనులు చేశారో ప్రజలందరికీ తెలుసని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. అంతకు ముందటి చంద్రబాబు ప్రభుత్వాన్ని చూశారని, ప్రస్తుతం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారని అన్నారు. ఈసారి వచ్చే రాజన్న రాజ్యంలో రైతు తాను పండించిన పంటను నష్టానికి అమ్ముకును దుస్థితి లేకుండా జగనన్న చూస్తారన్నారు. అవసరమైతే ఆ పంటను ప్రభుత్వంమే కొనుగోలు చేసేటట్టు చేస్తారన్నారు. ఆలమూరులో మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె అక్కడ చేరిన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు.

ప్రతి ఎకరాకూ నీళ్ళివ్వాలన్న రాజన్న కలను జగనన్న నెరవేరుస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. అందకీ సొంత ఇల్లు ఉండాలన్న రాజన్న ఆశయాన్ని జగనన్న తీరుస్తారన్నారు. ప్రతి కుటుంబానికీ 30 కిలోల బియ్యం ఇవ్వాలన్న రాజన్న మాటను జగనన్న నిలబెడతారని చెప్పారు. ఈసారి వచ్చే రాజన్న రాజ్యంలో మన కుటుంబాలు బాగుపడతాయని, మన పిల్లలు పెద్ద చదువులు చదువుకుంటారని అన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ, అభయహస్తం లాంటి పథకాలకు జగనన్న మళ్ళీ జీవం పోస్తారని తెలిపారు.

Back to Top