'కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు మరోసారి స్పష్టం'

ఖమ్మం, 17 ఫిబ్రవరి 2013: రాష్ట్రంలో సహకార ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్, ‌టిడిపి కుమ్మక్కు రాజకీయాలు మరోసారి స్పష్టం అయ్యాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు కొండాసురేఖ విమర్శించారు. సహకార ఎన్నికల్లో‌ కిరణ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆమె ఆరోపించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న సురేఖ ఆదివారంనాడు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. రాష్ట్రంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ధీమాను సురేఖ వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top