కాంగ్రెస్, టీడీపీలు వెన్నుపోటు పార్టీలు

రావికంపాడు, 16 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల, పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ  రావికంపాడు సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. మహానేత రాజశేఖరరెడ్డిగారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని రావికంపాడులో మరో ప్రజా ప్రస్థానం రెండు వేల కిలోమీటర్లు.. 150 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రసంగం శ్రీమతి షర్మిల మాటల్లోనే..

ఇది విజయ యాత్ర కాదు.. నిరసన యాత్ర
'ఇడుపులపాయలో నాన్న సాక్షిగా మొదలైన పాదయాత్ర ఇక్కడ రెండు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. దీనికి స్ఫూర్తి మహానేత చేపట్టిన ప్రజా ప్రస్థానం. చంద్రబాబు పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతుంటే రాజన్న మండుటెండలో ప్రజా ప్రస్థానం చేపట్టారు. అదే ఉద్దేశంతో ప్రజా ప్రస్థానానికి కొనసాగింపుగా మరో ప్రజా ప్రస్ఝథానం చేపట్టాం. ప్రజలు కష్టాలలో ఉన్నారు కాబట్టి, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి, టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమైంది కాబట్టి.. ప్రజలకు మంచిరోజులొస్తాయని భరోసా కల్పించాలని పాదయాత్ర  చేస్తున్నాను. జగనన్న రాజ్యంలో మంచిరోజులొస్తాయి. ఇది విజయ యాత్ర కాదు.. నిరసన యాత్ర. రాజన్న రాజ్యం సాధ్యమైన రోజునే అందరికీ పండగ. రానున్న ఎన్నికలలో కుట్రలను సంహరించిన రోజునే నిజమైన పండగ. అంతవరకూ జరిగేది పోరాటమే.. యుద్ధమే. కిరణ్ సర్కారులో ప్రజలు అల్లాడుతున్నారు. రైతులు అప్పుల పాలై అల్లాడుతున్నారు. చార్జీలు పెరిగి ఇల్లు గడవక మహిళలు సతమతమవుతున్నారు. పిల్లలను కూలీలకు తీసుకెడితే తప్ప ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడింది. ఇది కిరణ్  సర్కారు పాపం కాదా అని అడుగుతున్నా.

రాజన్న ఉండుంటే తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడు విడతలుగా మూడు గంటలు కరెంటిస్తున్నారని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఎక్కడా ఐదు గంటల మించి కరెంటు లేదు. పరిశ్రమలకు నెలకు వారంరోజులు కోత విధిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగస్థులు రోడ్డున పడ్డారు. ఏ వర్గంపైనా ప్రభుత్వానికి కనికరం లేదు. ప్రజల బాగోగులను  గాలికొదిలారు. అన్ని చార్జీలు పెంచారు. ముప్పై వేల కోట్ల రూపాయల కరెంటు భారాన్ని మోపారు.  ప్రజల రక్తం పిండి వసూలుచేస్తున్నారు. ఒక చేనేత కార్మికుడిఇక నాలుగు నెలలుగా అరవై వేలు బిల్లొచ్చింది. మేనెలలో మళ్ళీ ఇరవైవేలు బిల్లొచ్చింది. తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త  చూసి కడుపు తరుక్కుపోయింది.

ముఖ్యమంత్రంటే ఇలా ఉండాలని రాజన్న చూపించారు
రాజన్న రాజ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రాజన్న మృతితో రాష్ట్రం అతలాకుతలమైంది. ఆయన అన్ని వర్గాలకూ మేలు చేకూర్చారు. అందుకే ఇంకా ప్రజల గుండెల్లో మహానేత సజీవంగా ఉన్నారు. ముఖ్యమంత్రంటే ఇలా ఉండాలి.. ఇలా ఆలోచించాలి అని ఆదర్శంగా నిలిచారు. రైతుకు అండగా నిలిచారు. ఏడు గంటలు ఉచిత విద్యత్తు ఇచ్చారు. రుణమాఫీ చేశారు.  ఏడు గంటల ఉచిత కరెంటు ఇచ్చారు.  ఫీజు రీయింబర్సుమెంటుతో లక్షలాది మంది విద్యార్థులు పెద్ద చదువులు చదువుకున్నారు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదవారికి పెద్ద వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 20 నిముషాల్లో 108 అంబులెన్సు వచ్చేది. అందుకే రాజన్నను ప్రజలు గుండెల్లో దాచుకున్నారు. ఎన్నో పథకాలను అమలుచేసినప్పటికీ ఏ చార్జీనీ పెంచలేదు. ఆర్టీసీ చార్జీ, కరెంటు బిల్లు, మున్సిపలు టాక్సు పెరగలేదు. అయినా అన్ని కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు.  ప్రజల గుండె చప్పుడు అర్థంచేసుకున్న మనిషి కనక ఆయన అద్భుతమైన పథకాలు రూపొందించారు. ప్రజలంటే  రాజన్నకు స్వచ్ఛమైన ప్రేమ ఉంది.

నీరుగార్చడమే కిరణ్ పథకం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సొంత పథకాలు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులను అటకెక్కించారు. రైతులను ఇబ్బంది పెడుతున్నారు. తొమ్మిదిగంటల విద్యుత్తు బదులు మూడు గంటలనే ఇస్తున్నారు. అంధకార ప్రదేశ్ గా మార్చే పథకం. పరిశ్రమలను మూయించే పథకం.. 30 కేజీలిస్తానని 20 కేజీలే ఇస్తూ.. ప్రతి కుటుంబం నుంచి 400 దోచుకునే పథకం., ఆరోగ్యశ్రీని నీరుగార్చే పథకం.. ఇలా రాజన్న ప్రతి పథకాన్ని నీరు గారుస్తున్నారు కిరణ్ కుమార్.

చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలారు
అవిశ్వాసంలో ప్రజల పక్షాన నిలబడకుండా చంద్రబాబు విప్ జారీ చేసి చరిత్ర హీనుడిగా మిగిలారు. ఆరోజు మద్దతిచ్చి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలేది. అప్పుడు ఈ సమస్యలు ఉండేవి కావు. దీనికి కారణం చంద్రబాబు. కిరణ్ సర్కారు మైనారిటీలో పడింది. అయినప్పటికీ చంద్రబాబు మద్దతు కారణంగానే అధికారంలో ఉంది. కరెంటు బాధలకి చంద్రబాబు, కిరణ్ ఇద్దరూ బాధ్యులే. రాబందులు రాజ్యమేలుతుంటే గుంటనక్కలు తాళం వేసినట్లుంది వీరిద్దరి  ప్రవర్తన. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ కు రాసిచ్చినట్లు చంద్రబాబుకూడా టీడీపీని రాసిచ్చేసశారు. ఆ ఇద్దరిదీ వెన్నుపోటు చరిత్రే. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ ఆశయాలను కబ్జా చేశారు. కాంగ్రెస్ వెన్నుపోటు మరొకటి. రాజన్న ఉన్నంతకాలం మంచివాడని చెప్పి.. లబ్ధిపొంది రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరణానంతరం ఆయనకు వెన్నుపోటు పొడిచింది. రాజన్నను దూషించింది.. పథకాలకు తూట్టు పెట్టింది.. జగనన్నను జైల్లో పెట్టింది. చంద్రబాబుతో కుమ్మక్కై నీచ రాజకీయాలు చేసింది. స్వచ్ఛమైన రాజకీయం చేసే ధైర్యం, జగనన్నని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం కిరణ్, చంద్రబాబుకు లేవు. అందుకే అబద్ధపు కేసులు పెట్టి సీబీఐని ఉసి గొల్పి జైలులో పెట్టారు. జగన్ కాంగ్రెస్ ను వీడారు కనకనే ఇలా జరిగిందని ఆజాద్ చెప్పారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటే కేసులుండవట. లేకుంటే జైలు పాలు చేస్తారట.

రాజన్న ఉన్నప్పడు ఇంత మంచి ముఖ్యమంత్రి లేరన్నారు. జగన్ కాంగ్రెస్ ను వీడగానే రాజన్నను దోషి అన్నారు జగనన్నను జైలులో పెట్టారు. సీబీఐ లాంటి సంస్థలు కేంద్రం చెప్పినట్టే ఆడతాయని తేలింది. అవి బ్లాక్ మెయిల్ సంస్థలని తేలింది. ఈనాడు 100 రూపాయల షేరును ఎక్కువకు అమ్ముకుంటే కేసు లేదు. సాక్షి షేరును అమ్ముకుంటే క్విడ్ ప్రోకో అంటున్నారు.

చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని వామపక్షాలు పుస్తకమే రాశాయి. ఐఎమ్జీకి కోట్ల విలువైన భూముల్ని నాలుగు కోట్లకు ఇచ్చేశారు. చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో డబ్బు దొరికితే సీబీఐకి కనిపించదు. బొత్స పెద్ద మాఫియా అంటే సీబీఐకి వినిపించదు.

జగనన్న దోషని ఏ కోర్టూ చెప్పలేదు
జగనన్న దోషని ఏ కోర్టూ చెప్పలేదు. చంద్రబాబు నిర్దోషని ఏ కోర్టూ చెప్పలేదు. వియ్యంకుడి ఇంట్లో 70 కోట్లు దొరికిన చిరంజీవి, బొత్స ఉత్తముడనీ ఏ కోర్టూ చెప్పలేదు. కాంగ్రెస్ కు అనుకూలం కాబట్టి వారిపై ఏ కేసులూ ఉండవు. రాజకీయ స్వార్థం కోసం జగనన్నను జైలు పాలు చేసి ఏడాది గడిచింది. వీరి పాపం పండే రోజు దగ్గర్లో ఉంది. దేవుడు బుద్ధి చెప్పేరోజున దేశం అంతా తిరిగి చూస్తుంది. మాట నిలబెట్టుకోవడానికి జగనన్న ముందడుగు వేస్తున్నారు. జగనన్న బయటుంటే తమకు మనుగడ ఉండదనీ, దుకాణాలు మూయాల్సి వస్తుందని జైలు పాలు చేశారు. ఉంటే కాంగ్రెస్, ఉండాలి, లేదా టీడీపీ ఉండాలి అని వారు భావిస్తున్నారు.

రాజకీయంగా ఎదగకూడదనే..
జగనన్న రాజకీయంగా ఎదగకూడదనే జైలు పాలుచేశారు. బోనులో ఉన్నా సింహం సింహమే.. దేవుడు మంచి వాళ్ళ పక్కన నిలబడతాడు. ఉదయించే సూర్యడిని ఎలా ఆపలేరో అలాగే.. జగనన్నను ఎవరూ ఆపలేరు. ఆపే దమ్ము ఈ టీడీపీ నాయకులకు లేదు. రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తారు. అప్పటివరకూ జగనన్నను ఆశీర్వదించాలి. మాతో కలిసి నడవాలి. '

 అనంతరం ప్రసంగించిన పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పాదయాత్ర ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించారు. చంద్రబాబు కుట్రలను కళ్ళకు కట్టినట్లు వివరించారు. చంద్రబాబు పాలనలో జరిగిన అరాచకాలు తెలియజేశారు. బషీర్ బాగ్ కాల్పులు, ఐఎమ్‌జీ వ్యవహారం, రామలింగరాజుతో  అనుబంధం తదితరాలను ప్రస్తావించారు. ప్రజలంతా తమ వెంట నడవాలని విజ్ఞప్తిచేశారు.

Back to Top