'కాంగ్రెస్‌ ప్రభుత్వానికి జనం గుణపాఠం తప్పదు'

శ్రీకాకుళం : కుట్రలు, కుతంత్రాలు చేసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని వేధిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ కణితి విశ్వనాథం హెచ్చరించారు.‌ కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. జిల్లా బూర్జ మండలంలోని చినలంకాంలో శనివారం నిర్వహించిన సహకార ఎన్నికల శంఖారావ సభలో డాక్టర్‌ కణితి ముఖ్య అతిథిగా మాట్లాడారు.

అధికారాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నాయకులు సహకార ఎన్నికల్లో లక్షలాది మందిని బోగ‌స్ ఓటర్లను ‌చేర్పించారని విశ్వనాథం ఆరోపించారు. ఎవరు ఎన్నికుట్రలు పన్నినా ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి మద్దతు ఇచ్చేవారే ఘన విజయం సాధిస్తారని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలతో మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అదే అభిమానాన్ని వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహ‌న్‌రెడ్డిపైనా చూపిస్తున్నారని చెప్పారు. ఏ తప్పు చేయకపోయినా శ్రీ జగన్‌ను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మోసగించిన చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు.

పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు వరుదు కల్యాణి, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ హనుమంతు కిర‌ణ్‌కుమార్‌, జిల్లా కమిటీ సభ్యుడు పైడి కృష్ణప్రసాద్ కూడా ప్రసంగించారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరారు.
Back to Top