‌కాంగ్రెస్‌ ప్రభుత్వానికి జగన్ అంటే హడల్

హైదరాబా‌ద్, 25 సెప్టెంబర్‌ 2012: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, మైనార్టీ నాయకుడు హెచ్‌ఎ రెహ్మాన్‌ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్ ని‌ర్దోషిగా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వాన్‌పిక్‌ భూముల కేటాయింపు కేసు విచారణ అక్టోబర్‌ 9వ తేదీకి వాయిదా పడిన అనంతరం మంగళవారం నాడు రెహ్మాన్‌ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నదని రెహ్మాన్ విమర్శించారు. జగ‌న్మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటికి వస్తే ప్రభుత్వం కూలిపోతుందేమోనని కాంగ్రెస్‌ ‌పార్టీ హడలెత్తిపోతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మాన ప్రసాదరావు నుంచి ష్యూరిటీలు తీసుకొని కోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చిందని, అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న జగన్‌కు బెయిల్‌ నిరాకరించడంలోని ఔచిత్యాన్ని రెహ్మాన్‌ ప్రశ్నించారు.
Back to Top