హైదరాబాద్ ) అసెంబ్లీ తరపున ఎమ్మెల్యేలను విహార యాత్రలకు తీసుకెళ్లాలన్న నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తప్పు పట్టింది. ఈ యాత్రలకు తమ ఎమ్మెల్యేలు వెళ్లటం లేదని వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితులు బాగో లేవని చెబుతూనే విహార యాత్రలకు తీసుకొని వెళ్లటం ఎంత వరకు సబబని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్ని ఐదు రోజుల్లో ముగించాలన్న నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. కనీసం 20 రోజులైనా సమావేశాల్ని నిర్వహించాలని జ్యోతుల డిమాండ్ చేశారు. అనేక ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.<br/><br/>