పట్టిసీమపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రాజమండ్రి: పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై శ్వేతపత్రం విడుదల
చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు.
పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబుకు రూ.300 కోట్లు క్విక్ బ్యాక్
ముట్టాయని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ తీరుపై ప్రభుత్వ
వైఖరిని ప్రజలకు తెలియజేసేందుకే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
బస్సుయాత్ర చేపడుతున్నారని తెలిపారు.
Back to Top