వైయస్‌ జగన్‌ రాజకీయ పునర్‌ జన్మనిచ్చారు

 

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ తనకు రాజకీయ పునర్‌ జన్మనిచ్చారని వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  చంద్రబాబు వైఖరి గురించి అందరి కంటే నాకే ఎక్కువ తెలుసు అన్నారు. రెండు పర్యాయాలు కూడా ఇక్కడి నుంచే పోటీ చేసిన వ్యక్తిగా నాకే ఎక్కువ అనుభవం ఉందన్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటి చేసినా, నా తల్లి మరణిస్తే పరామర్శించే దిక్కు లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున మాత్రమే నాకు ఓదార్పు దక్కిందన్నారు. వెధవ రాజకీయాల నుంచి తప్పుకుందామని భావించానన్నారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన భీఫాంపై గెలిచిన వ్యక్తులు 23 మంది ఫార్టీ ఫిరాయించి స్వలాభం కోసం పార్టీ మారారని విమర్శించారు. 23 మంది కారణంగా నష్టపోయిన వారందరూ కూడా వైయస్‌ జగన్‌ వెంటే నడిస్తే మంచిదన్నారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే..నేను పార్టీ రాజీనామా చేసిన తరువాత 9 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు ఇవాళ రాజకీయంగా పునర్‌ జన్మనిచ్చింది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. పార్టీని మోసం చేసిన వ్యక్తులకు కచ్చితంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విలువలకు మారుపేరు అయిన డాక్టర్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా ఉందామన్నారు.  ఆయన వారసుడు, ఆయన రక్తం, మహానేత పథకాలను వేటిని కూడా వదలకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించే సత్తా ఉన్న వైయస్‌ జగన్‌కు మద్దతివ్వాలని కోరారు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
 
Back to Top