పూలే సేవ‌లు మరువలేనివి

హైదరాబాద్ః వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైయస్సార్సీపీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నివాళులర్పించిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్థసారథి, భూమన కరుణాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితర నేతలున్నారు. 

ప్రకాశంః బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల అభ్యున్న‌తికి మ‌హాత్మ జ్యోతిరావుపూలే ఎన‌లేని కృషి చేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి బ‌త్తుల బ్ర‌హ్మానంద‌రెడ్డి అన్నారు. పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఒంగోలు పార్టీ కార్యాల‌యంలో చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. పూలే చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు కుప్పం ప్ర‌సాద్‌, సింగ‌రాజు వెంక‌ట‌రావు, గంటా రాము, అనురాధ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ద‌ర్శిలో..
ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో పూలే జ‌యంతి కార్య‌క్రమాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో పూలే చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. 

చీరాల‌లో...
ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ ఆధ్వ‌ర్యంలో మ‌హాత్మ జ్యోతిరావు పూలే జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బాప‌ట్ల పార్ల‌మెంట‌రీ స‌మ‌న్వ‌య‌క‌ర్త వ‌రికూటి అమృత‌పాణి పాల్గొని పూలే చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 
Back to Top