ఓట్లు వేయించుకుని మోసం చేశారు...

 
బాబూ సర్కార్‌పై జూట్‌ మిల్లు కార్మికుల ఆగ్రహం
విశాఖః చిట్టివలస జూట్‌ మిల్లు ఆస్తులను బాబు సర్కార్‌ అమ్ముకుంటుందని కార్మికులు ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కార్మికులు కలిసి సమస్యలు విన్నవించారు. 2014లో రెండునెలల్లో మిల్లును మళ్ళీ తెరిపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని మంత్రి గంటా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పుతామన్నారు. వైయస్‌ జగన్‌ స్పందిస్తూ కార్మికులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
 
Back to Top