చివరకు ధర్మమే గెలుస్తుంది

హైదరాబాద్‌: ఎవరెన్ని కుట్రలు చేసినా, ప్రలోభ పెట్టిన చివరకు ధర్మమే గెలుస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గంగుల ప్రభాకర్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు నానితో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా వారికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే.. గంగుల కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.   గంగుల కుటుంబాన్ని వైయస్‌ఆర్‌సీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. అన్ని రకాలుగా వారికి తోడుగా ఉంటాం. 

ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం. ఎంత అన్యాయమైన స్థాయిలోకి రాజకీయాలను  తీసుకెళ్లారో చూస్తున్నాం. ఇవాళ చంద్రబాబు అధికారంలో ఉన్నాడని అన్యాయం చేయవచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిపోయాయి. వచ్చేది ఎన్నికల సంవత్సరమే. ఇవాళ అన్యాయం, మోసం చేస్తున్న వారికి బుద్ధి చెబుదాం. బాబు దగ్గరుండి ప్రలోభ పెట్టి ప్రజాప్రతినిధులను తన పార్టీలోకి లాక్కుంటున్నారు. మాములుగా మనం కూడా కాలక్షేపానికి సినిమాకు వెళ్తాం. ఆ సినిమా చూసినపుడు, లేదా బైబిల్, ఖురాన్, భగవత్గీత చదువుతాం. ఎందులో చూసినా అధర్మం, అన్యాయం గెలిచినట్లు కనిపిస్తుంది. ఇదంతా కూడా సగం దాకానే. చివరకు మాత్రం ధర్మం గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుందని గట్టిగా చెబుతున్నాను. 14 రీళ్ల సినిమాలో 13 రీళ్ల వరకు విలన్‌దే ఆధిపత్యం కనిపిస్తుంది, 14వ రీల్‌లో కథ అడ్డం తిరుగుతోంది. చివరకు హీరోదే పై చెయిగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన మీ ఆందరికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. 
Back to Top