వైయ‌స్ఆర్‌సీపీతోనే అందరికీ న్యాయం

చిట్వేలి: వైయ‌స్ఆర్‌సీపీతోనే అందరికి న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మతున్నారని  పార్టీ మండల కన్వీనర్‌ చెవ్వు శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఇంటింటికి వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్య‌క్రమం మండలంలోని రాజుకుంట పంచాయ‌తీలోని చింతలచెలిక బీసీకాలనీ, అరుంధతీవాడలో  నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ది, వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల గురించి వివ‌రించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..చంద్ర‌బాబు మూడేళ్లపాలన అంతా ప్రచార ఆర్భాటం మోసం, దగా, వంచన‌తో సాగిపోయిందని ప్రజలు చెప్పుకుంటున్నారని అన్నారు. నవ్యాంధ్రకు నవరత్నాలతో  మంచి రోజులు రానున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చామన్నారు.   కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, దళితనాయకులు లింగం లక్ష్మికర్, మల్లికార్జున, ప్రకాశం, సుబ్బరాయుడు, చిదంబరం, ఆయకట్టు సుబ్బరాయుడు, శివ, శ్రీనివాసులు, చిన్నయ్యనాయుడు, అయ్యప్ప, క్రిష్ణయ్య, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top