బయటకు వెళ్లాలంటే మాకు భయం

హైదరాబాద్ :

‘సభ లోపల ఒకరిని ఒకరు కౌగిలించుకోవచ్చు. బయటకు వెళితే విషపు చూపులు గుచ్చుతున్నాయి. నగరం విడిచి వారం రోజులు బయటకు వెళ్లాలంటే కుటుంబానికి భద్రత ఉంటుందో ఉండదో అనే భయం వేస్తోంది’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ‌ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విడిపోతే పరిస్థితి మరింత కష్టంగా మారిపోతుందని, అందుకే సమైక్యాంధ్ర కోరుకుంటున్నామని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్ర‌ కారణంగా వచ్చిన రాష్ట్ర విభజన బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చలో భాగంగా జూపూడి శుక్రవారం శాసనమండలిలో మాట్లాడారు.

‌యాస పేరుతో హైదరాబాద్‌ను విభజించాలని చూస్తున్నారని, హైదరాబాద్‌లో పుట్టిన వాళ్లు మాత్రమే ఇక్కడ ఉండాలని అంటున్నారని జూపూడి అన్నారు. ‘ఆంధ్ర ప్రాంతాన్ని పాలకులు అభివృద్ధి చేయలేదు. పెట్టుబడులన్నీ హైదరాబాద్ చు‌ట్టూరానే తిరిగాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మాత్రం అన్ని ప్రాంతాల‌నూ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేశారు’ అని చెప్పారు.

Back to Top