కాంగ్రెస్ పార్టీది మొండి వైఖరి: జూపూడి

హైదరాబాద్ 30 ఆగస్టు 2013:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన దీక్షను వెంటనే విరమించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు శుక్రవారం హైదరాబాద్లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర  విభజన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏదైనా పోరాడి సాధిద్దామన్నారు. రాష్ట ప్రజలంతా మీ వెంటే ఉన్నారని ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. దయచేసి దీక్ష విరమించాలని జూపూడి సూచించారు. మరో వంక, శ్రీ జగన్మోహన్ రెడ్డి చేపట్టి  దీక్ష శుక్రవారానికి ఆరో రోజుకు చేరుకుంది. గత అర్థ రాత్రి ఆయన్ని చంచల్గూడ జైలు నుంచి భారీ బందోబస్తు నడుమ జగన్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రిలో కూడా దీక్ష విరమించలేదు. ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందనీ, ఈ నేపథ్యంలో దీక్ష విరమించాలని ఉస్మానియా వైద్యులు చేసిన సూచనలను ఆయన తిరస్కరించారు.ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొంటూ జూపూడి పైమేరకు విజ్ఞప్తి చేశారు

Back to Top