సీమాంధ్ర లాయర్లపై దాడికి ఖండన

హైదరాబాద్  06 సెప్టెంబర్ 2013:

హైకోర్టులో సీమాంధ్ర లాయర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ చెప్పారు. లాయర్లపైనే దాడి చేస్తే మిగిలినవారి పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. హైకోర్టులో న్యాయవాదులపై దాడి ప్రజాస్వామ్య విలువలు దిగజార్చేలా ఉందన్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా పరిగణించాలన్నారు. పరిస్థితిని అదుపుచేయలేకుంటే ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పోలీసు కమిషనర్ కలిసిన పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడైనా వచ్చిందా అని ప్రశ్నించారు. శాంతి పరిరక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని జూపూడి విమర్శించారు. హైకోర్టులో జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తాజా వీడియోలు

Back to Top