జులై 2న వంచనపై గర్జన

అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జులై 2న వంచనపై గర్జన కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కొనసాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, తలారి రంగయ్య తెలిపారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో వంచనపై గర్జన దీక్ష ఏర్పాట్లను శనివారం వారు సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతున్నట్లు చెప్పారు. విభజన హామీలు అమలు కాకపోవడానికి చంద్రబాబు, మోడీనే కారణమని విమర్శించారు.
 
Back to Top