10న లా కమిషన్‌ను కలువనున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ

హైదరాబాద్‌:  జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఇవాళ లా కమిషన్‌ సంప్రదింపులు ప్రారంభించింది. ఏడు జాతీయ పార్టీలు, 59 ప్రాంతీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరుపనుంది. ఈ నెల 10న లా కమిషన్‌ ఎదుట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. లా కమిషన్‌ సంప్రదింపులకు తాము హాజరు కాలేమని కాంగ్రెస్, సీపీఎం ఇప్పటికే స్పష్టం చేశాయి. జమిలి ఎన్నికలతో వనరులు, సమయం ఆదా అవుతుందని అభివృద్ధి వేగం అవుతుందని ప్రధాని అభిప్రాయపడుతున్నారు. 
 
Back to Top