జుజ్జువరం, నిడుమోలులో నేడు 'రచ్చబండ'

పామర్రు (కృష్ణా జిల్లా), 1 ఏప్రిల్ 2013: శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 108వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆమె కృష్ణా జిల్లా పామర్రు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి 14వ మైలురాయి జుజ్జువరం వరకూ పాదయాత్ర చేస్తారు. అక్కడ ఆమె మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నిమ్మకూరు ఎక్సురోడ్, మలయప్ప‌న్‌పేట, నిడుమోలు, తరకటూరు, తరకటూరుపాలెం మీదుగా పాదయాత్ర సాగుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జుజ్జువరం, నిడుమోలులో షర్మిల రచ్చబండ నిర్వహిస్తారు. తరకటూరు పాలెం వద్ద రాత్రి బస చేస్తారు. ఇవాళ 15.5 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ కృష్ణాజిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు.
Back to Top