రాష్ట్రాభివృద్ధిని తాకట్టు పెట్టి విహారయాత్రలు

కేసుల భయంతో రాష్ట్రానికి వెన్నుపోటు
ప్రజాసమస్యలు విస్మరించి విలాసాలు
చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైయస్సార్సీపీ నేతలు
వైయస్ జగన్ నాయకత్వంలో పోరాడుతాం
అక్రమ ప్రాజెక్ట్ లను అడ్డుకొని తీరుతాంః పార్టీ నేతలు

కర్నూలు: చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు తాకట్టుపెట్టి విహారయాత్రలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలు చేస్తుంటే పనిగట్టుకొని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ నీచస్థాయికి దిగజారారని విమర్శించారు.  చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని ప్రత్యేక హోదాను సాధించడంలో కూడా బాబు పూర్తిగా విఫలమయ్యాడన్నారు.  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేసే వరకు పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

ఏపీ సీఎం చంద్రబాబు అసమర్థుడని వైయస్‌ఆర్‌ జిల్లా ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. కర్నూలు జలదీక్ష 3వ రోజు బుధవారం ఆయన మాట్లాడుతూ..కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే టీడీపీ సర్కార్‌ గాఢ నిద్రలో ఉందని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్నందుకే బాబు కేసీఆర్‌పై నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. ఏపీ మంత్రులు పనికిమాలిన వారని విమర్శించారు.  చంద్రబాబుది నిర్లక్ష్యం అనుకోవాలా? అసమర్ధుడా? అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ప్రజల హక్కుల కోసం వైయస్‌ జగన్‌ చేస్తున్న దీక్షలకు ప్రతి ఒక్కరు మద్దతు పలికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మేల్కొలుపుదామని పిలుపునిచ్చారు.

రాష్ట్రాభివృద్ధి కోసం భార‌త దేశంలో ఏ నాయ‌కుడు ఇన్ని దీక్ష‌లు చేసి ఉండ‌రని, అది కేవ‌లం ఒక్క వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాత్ర‌మే నని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు మెరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వైయస్ దీక్ష‌లు చేప‌డుతూ.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేస్తున్నార‌ని మేరుగ నాగార్జున చెప్పారు. అవనీతి కేసులలో ఇరుక్కుపోయి బాబు అభివృద్ధిని గాలికి వ‌దిలేశారని నాగార్జున మండిపడ్డారు. ప‌క్క రాష్ట్రం అక్ర‌మంగా చేప‌డుతున్న ప్రాజెక్టులను చూసైనా బాబు బుద్ది తెచ్చుకోవాల‌న్నారు.  

అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న విశ్వాసంతో గెలిచి.... 420 చంద్రబాబుతో చేతులు కలిపిన వారంతా రానున్న రోజుల్లో 840లుగా మిగిలిపోతారని పార్టీ సీనియర్‌ నేత బుడ్డా శేషారెడ్డి ఫిరాయింపుదారులపై మండిపడ్డారు.  వైయస్‌ జగన్‌ జలదీక్షకు మద్దతు తెలిపిన బుడ్డా శేషారెడ్డి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు మెదడులో గుజ్జుకు బదులు మట్టి బురద ఉందని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పుడు సీఎం అయినా అతివృష్టి, అనావృష్టితో కొట్టుమిట్టాడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్రమ ప్రాజెక్టులను కడుతుంటే చంద్రబాబు మాత్రం విహార యాత్రలకు వెళ్లివస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గొప్ప మనస్సుతో రైతులను ఆదుకోవాలనే ధృడ సంకల్పంతో వైయస్‌ జగన్‌ దీక్ష చేస్తున్నారని చెప్పారు. 

To read this article in English: http://bit.ly/1Nykn3y

Back to Top