సమస్యలన్నీ జగనన్నకు వివరించాం
అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా.. లేనట్లుగానే ఉందన్నారు. హెచ్‌ఎల్‌సీ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు తీసుకురాకుండా.. మా కాల్వల నుంచి వేరే నియోజకవర్గాలకు నీరు వెళ్తున్నా ఏం చేయలేకపోతున్నారని మండిపడ్డారు. అదే విధంగా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, కొన్ని పాఠశాలకు రవాణా సౌకర్యం కూడా లేకపోవడంతో పిల్లలు చదువుకు దూరమతున్నారన్నారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చంద్రబాబు నరకాన్ని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీ సభ్యులు ప్రజలను యమదూతలుగా పీడిస్తున్నారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పెన్షన్‌లు అందుకున్న వారందరిని అనర్హులుగా ప్రకటించి వారి ఉసురు పోసుకున్నారన్నారు. నియోజకవర్గంలోని సమస్యలన్నింటిపై వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశామని, అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. 
Back to Top