జననేత సమక్షంలో పార్టీలో చేరిన శ్రీనివాసరావు

పశ్చిమ గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ వడ్లపట్ల శ్రీనివాసరావు జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శ్రీనివాసరావుతో పాటు దుగ్గిరాల మాజీ సర్పంచ్‌ వెంటం ఆనందరావుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ దెందులూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా అఖండ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. 
Back to Top