వైయ‌స్ఆర్ సీపీలోకి చేరిక‌లు

శ్రీ‌కాకుళంః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఆధ్వ‌ర్యంలో కోటబొమ్మాళి మండలంలోని చీపుర్లపాడు పంచాయతీకి చెందిన పలువురు నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాన వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం చేస్తున్న పోరాటాలు, రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమానికి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప్ర‌యోజ‌నాల‌కు ఆక‌ర్షితులై పార్టీలో చేరుతున్నార‌న్నారు. పార్టీలో చేరిన వారిలో  పి.నాయుడు, సి.హెచ్‌.ఆదిత్య, ఎస్‌.లక్ష్మణరావు, సి.హెచ్‌.రాంబాబు, ఎం.రమేష్, పి.రమేష్, సి.హెచ్‌.చిన్నారావు, కె.రాము, ఎం.లక్ష్మణ, ఎస్‌.సిసింద్రీ, సి.హెచ్‌.సూర్య, వి.రాము, వై.మల్లేశ్, ఎస్‌.కృష్ణ, ఎల్‌.సూర్యనారాయణలు ఉన్నారు. కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, మండల కన్వీన‌ర్‌ రాజు, నేతింటి అప్పలస్వామి , అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top