వైయస్సార్‌ సీపీలో చేరిక

విశాఖ(డుంబ్రిగుడ):డుంబ్రిగుడ మండలంలోని గుంటగన్నెల పంచాయతీ పరిధిలో ఉన్న వివిధ పార్టీల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో నాయకులు ,పార్టీ కార్యకర్తలు వైయస్సార్‌ సీపీలో చేరారు. అరకునియోజక వర్గ సమన్వయకర్త చెట్టి పాల్గుణ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెట్టి పాల్గుణ మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో అభివృద్ది జరగడం లేదని అన్నారు. ఇచ్చిన హామీలు పరిష్కరించని కారణంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైయస్సార్‌ సీపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. రానున్న కాలంలో టీడీపీ పార్టీ గిరిజన ప్రాంతంలో ఖాళీ అవుతుందని అన్నారు.  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే గిరిజన గ్రామాల్లో అభివృద్ది సాధ్యపడుతుందని ఆమె అన్నారు.

Back to Top