వైయస్ఆర్ కుటుంబంలో చేరండి

దేవనకొండ : వైయస్సార్‌ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరి పార్టీకి మద్దతు తెలపాలని వైయస్సార్సీపీ మండల కన్వీనర్‌ దాసరి లుముంబా కోరారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక అయ్యప్పస్వామి దేవాలయంలో మండల కార్యకర్తల బూత్‌కమిటీ నిర్వహించారు. ఈ సమావేశంలో 28 బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లుముంబా మాట్లాడుతూ... తమపార్టీ అధినేత ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో పేదలందరూ లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు. జగనన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రతిఒక్కరు వైయస్సార్‌ కుటుంబంకు సంబంధించిన మొబైల్‌ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని ఆయన కోరారు. బూత్‌కమిటీ సభ్యులు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పార్టీ మండల కో–కన్వీనర్‌ కిట్టు, నాయకులు అలారుదిన్నె నారాయణరెడ్డి, వై.రామాంజనేయులు, మద్దికెర అంజి, పి.వెంకటరాముడు, కందనాతి రంగన్న, బలరామ్, పులినరేష్, పొట్లపాడు లక్ష్మన్న, నాగరాజు, పెద్దోడు, కొత్తపేట బాషా, మద్దిలేటి, కబీర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top