రాళ్ల దాడి- వై.కాంగ్రెస్ ఎమ్మెల్యేకి గాయాలువైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కంబాల జోగులు రాళ్ల దాడిలో గాయపడ్డారు. కొత్తగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎపి శాసనమండలికి ఎన్నికైన కొలగొట్ల వీరభద్రస్వామి కి అబినందన సభ జరిగింది.విజయనగరంలో జరిగిన ఈ సభలో జోగులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుండగా కొందరు దుండగులు రాళ్లు విసిరారు.దాంతో జోగులు గాయపడ్డారు. జోగులు శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన ఎన్నికయ్యారు.ఈ గొడవతో సభలో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగకూడదు అని నిపుణులు వాపోతున్నారు.