ప్రభుత్వానికి పేదలంటే చిత్తశుద్ధి లేదు

 


విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వానికి పేదలంటే చిత్తశుద్ధి లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పొయిన నిర్వాసితులు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. బాధితులతో కలిసి ఆయన ధర్నాలో పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ..ఇబ్రహీంపట్నం– మైలవరం రోడ్డు విస్తరణ నిర్వాసితులైన పేదలకు నష్టపరిహారం ఇస్తామని, ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. మంత్రి దేవినేని ఉమా, కలెక్టర్, ఎంఆర్‌వో కార్యాలయల చుట్టూ  తిరిగి వేశారిపోయిన నిర్వాసితులు సీఎం ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తే న్యాయం చేస్తామని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి తీసుకొచ్చి తీరా కొంత మందికే ఇల్లు కట్టిస్తామని అధికారులు చెప్పడం బాధాకరమన్నారు.  ఇల్లు కూల్చే సమయంలో బాధితులందరికి ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని చెప్పిన మంత్రి పారిపోయారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని, ప్రభుత్వ తీరుతో విసికిపోయిన బాధితులు ఆందోళన బాట పట్టారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్వాసితులకు న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని జోగి రమేష్‌ హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top