సవాల్ ను స్వీకరించలేక దొడ్డిదారిన ఎస్కేప్

  • వైయస్ జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
  • ఓర్వలేక ప్రభుత్వం మీడియా ముందు గాలిగాలిగా వాగుతోంది
  • అమ్మ..అక్క..చెల్లికి తేడా తెలియని వెదవలు క్యాబినెట్ లో ఉన్నారు
  • ఎల్లోమీడియాలో గాలివార్తలు రాయించి గోలగోలగా అరుస్తున్నారు
  • వైయస్ జగన్ సవాల్ తో  బాబు, మంత్రుల నోళ్లు మూగబోయాయి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్
విజయవాడః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విసిరిన సవాల్ తో బాబు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టైందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. వైయస్ జగన్ సవాల్  విసిరి 24 గంటలు దాటినా ఇతవరకు చంద్రబాబు, మంత్రులనుంచి సమాధానం లేదన్నారు.  సవాల్ ను స్వీకరించే సత్తా లేక చంద్రబాబు, మంత్రులు దొడ్డిదారిన పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. విదేశీ కంపెనీలతో తనకు సంబంధముందని నిరూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని, నిరూపించకపోతే బాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వైయస్ జగన్ పాదయాత్రలో చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. రెండ్రోజులుగా మీడియా ముందు ఇష్టమొచ్చినట్టుగా అరుస్తున్న మంత్రులు ఎక్కడపోయారని, నోరుమూగబోయిందా అని చురకలు అంటించారు. చంద్రబాబు ఎల్లోమీడియాలో గాలి వార్తలు రాయించి మీడియా ముందు గోలగోలగా అరుస్తున్నారని రమేష్ విమర్శించారు. విజయవాడలో జరిగిన పార్టీ కార్యాలయంతో మీడియాతో మాట్లాడారు. 

వైయస్ జగన్ విసిరిన సవాల్ ను స్వీకరించలేకపోతే జగన్ పై వేసిన నింద పొరపాటని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని చంద్రబాబును జోగి రమేష్ డిమాండ్ చేశారు. లేకపోతే జగన్ ను దుర్బషలాడుతూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడిన మంత్రులతో క్షమాపణ చెప్పించి లెంపలు వేయించుకోవాలన్నారు. ఎల్లోమీడియాలో ఒకటికి వందసార్లు దొంగ దొంగ అంటూ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి, చెల్లికి, భార్యకి తేడా తెలియని వెదవలు మంత్రివర్గంలో ఉన్నారని జవహర్ పై నిప్పులు చెరిగారు.  అక్కచెల్లెమ్మలు జననేత పట్ల ఆత్మీయత, అనురాగం, ప్రేమ పంచుతుంటే ఓర్వలేని ఈ ప్రభుత్వం ముద్దులయాత్ర అంటూ హేళన చేసేలా మాట్లాడడం దారుణమన్నారు. నీకు అమ్మ, అక్కచెల్లెల్లు లేరా అని మంత్రి జవహర్ పై ధ్వజమెత్తారు..? ఇంత చెండాలంగా మాట్లాడే ప్రభుద్ధులు క్యాబినెట్ లో ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. 

మంత్రి ఆదినారాయణరెడ్డికి సిగ్గు, శరం, చీము నెత్తురు లేదంటూ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజ్యాగం విలువల్ని మంటగల్పిన వ్యక్తి స్పీకర్ అని ఫైర్ అయ్యారు. 21మంది ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్లా చంద్రబాబు కొంటుంటే ...ఫిరాయింపుపై ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి వెన్నుపోటు బాబుకు స్పీకర్ వత్తాసు పలుకడం దారుణమన్నారు.  దొడ్డిదారిన  రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బాబుకు తాబేదారుడిగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.  ప్రజాస్వామ్య వ్యవస్థను స్పీకర్ ఖూనీ చేశాడని ప్రజాస్వామ్య వాదులంతా ముక్కున వేలేసుకుంటున్నారని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఫిరాయింపుదారులతో  రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు.  ఎవరి బలమేంటో తేల్చుకుందామన్నారు. వైయస్  జగన్ పాదయాత్రకు  ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రమేష్ స్పష్టం చేశారు. అక్కచెల్లెలు, అన్నదమ్ములు, నిరుద్యోగయువత జగన్ రావాలి, జగన్ కావాలని కోరుకుంటున్నారన్నారు. 
Back to Top